ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం… ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆటా ప్రతినిధులు.. సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు మహాసభలకు ఏపీ సీఎంను ఆహ్వానించారు ఆటా ప్రతినిధులు.. సీఎంని కలిసినవారిలో ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాద రెడ్డి లింగాల, సన్నీ రెడ్డి, జయంత్ చల్లా ఇతర ప్రతినిధులు ఉన్నారు.. కాగా, వాషింగ్టన్ డీసీలో జులై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు 17వ ఆటా మహాసభలు జరగనున్నాయి.
Read Also: CBI: రూ.61.71 కోట్లు మోసం.. రైస్ మిల్లుపై సీబీఐ కేసు..
