అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును ఎట్టకేలకు తాకాయి లేలేత భానుడి కిరణాలు. రెండవ రోజు స్వామి మూలవిరాట్టును తాకిన సూర్య కిరణ స్పర్శతో బంగారు వర్ణంలో మారిపోయారు స్వామి. సూర్యభగవానుడి కిరణాలు పడ్డ విగ్రహాన్ని దర్శించి తరించారు భక్తులు. కిరణదర్శనం చేసుకొని పులకించి పోయింది భక్తకోటి.
2వ రోజు స్వామి మూలవిరాట్టును తాకాయి సూర్యకిరణాలు. ఉదయం సుమారు 6.26 మొదలైన 6.31 ని.ల వరకు ఈ స్పర్శ మూలవిరాట్టును తాకాయి. సుమారు 5 నిముషాల పాటు పాదాల నుండి శిరస్సు వరకు స్వామిని తాకిన కిరణాలు చూడడం ఎంతో శుభకరం, ఆరోగ్యదాయకం అంటున్నారు భక్తులు. ప్రతి ఏటా ఉత్తరాయణం లో మార్చి 9 , 10, తేదీలలో స్వామివారి పై సూర్యకిరణాల స్పర్శ పడుతుంది. అలాగే, దక్షిణాయనం అక్టోబర్ 1, 2 3 తేదీలలో ఈ అద్భుతమైన ఘట్టం కనువిందు చేయనున్నాయి. మార్చి 9వ తేదీన మేఘాల కారణంగా కిరణాలు సూర్యనారాయణ స్వామిని తాకలేదు. గురువారం భానుడి కిరణాలు స్వామిని తాకుతాయని భక్తులు విశ్వసించారు. వారి విశ్వాపానికి అనుగుణంగానే భానుడి లేలేత కిరణాలు స్వామిని తాకడంతో ఆ అద్భుత ఘట్టాన్ని వీక్షించిన భక్తులు పులకాంకితులు అయ్యారు.