Site icon NTV Telugu

APSRTC: టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ సమయంలో ఉచిత ప్రయాణం..

Apsrtc

Apsrtc

APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఏపీఎస్‌ఆర్టీసీ.. రాష్ట్రంలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారికి గుడ్‌న్యూస్‌ వినిపించింది.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.. అన్ని పల్లె వెలుగు, సిటీ ఆర్జినరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది. బస్సు పాస్‌ లేకున్నా.. హాల్‌ టికెట్‌ చూపించి విద్యార్థులు ఉచితంగా తమ గమ్యస్థానం నుంచి పరీక్షా కేంద్రానికి.. ఆ తర్వాత ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి తమ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు అని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.. కాగా, ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పరీక్షల సమయంలో ఈ అవకాశం ఉంటుంది.. మరోవైపు.. పరీక్షల సమయంలో విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను సిద్ధం చేస్తోంది ఏపీఎస్‌ఆర్టీసీ. హాల్ టిక్కెట్ ఉంటే చాలు అనుమతించాలని ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానంద రెడ్డి.. కాగా, ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్‌ 18వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షల సమయంలోనే ఈ సదవకాశం ఉంటుంది.. ఇక, ఈ విద్యా సంవత్సరం దాదాపు 6.5 లక్షల మంది పరీక్షలకు హాజరుకాబోతున్నారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version