APSRTC Strike: ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు సమ్మె సైరన్ మోగించాయి. ఏపీఎస్ఆర్టీసీకి నాలుగు రోజుల సమయం ఇస్తూ సమ్మెకు సిద్ధమౌతున్నట్టు ప్రకటించాయి. తమకు స్త్రీ శక్తి వల్ల ఏర్పడిన భారాలను తగ్గించుకోవడానికి అద్దె రూ. 20వేలు పెంచాలని కోరినా కేవలం రూ. 5 వేలే పెంచారని ఆందోళనకు దిగారు. ఓఆర్ మీద దృష్టి పెట్టారే తప్ప తమ గోడు పట్టించుకోవడం లేదని, మరో నాలుగు రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే సమ్మె చేస్తామని అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి తేల్చి చెప్పారు.
Read Also: 120Hz రిఫ్రెష్ రేట్, 50MP రియర్ కెమెరా, వైర్ లెస్ ఛార్జింగ్తో Vivo X200T
స్త్రీ శక్తి వచ్చాక బస్సుల్లో ఓఆర్ పెరిగిందని అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 100 మంది ఎక్కుతున్నారు.. బస్సులో ప్రయాణీకులు పెరగడంతో బస్సు రిపేర్ ఖర్చులు పెరిగిపోయాయి.. మా ఇన్సూరెన్స్ ల కవరేజీల గురించి పట్టదా అని ప్రశ్నించారు. మా డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు జరిగాయి.. తలలు పగుల కొట్టించుకుని కూడా పని చేశారు.. ఇప్పుడు డ్రైవర్లు, కండక్టర్లు, మిగతా యజమానుల బస్సులు నడపడానికి ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు. చాలా చోట్ల బస్సులకు ప్రమాదాలు జరిగాయి.. బస్సు కాలపరిమితితో పని లేకుండా మార్పులు చేసి నడిపిస్తున్నారు.. మా డిమాండ్ పై నాలుగు రోజుల్లో ఆశించిన సమాధానం రాకపోతే సమ్మె తథ్యమని వెంకటేశ్వరరెడ్డి చెప్పారు.
