Site icon NTV Telugu

APSRTC: ఆర్టీసీ చరిత్రలో ఇదే తొలిసారి.. త్వరలో 1,500 డీజిల్‌, వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు..

Dwaraka Tirumala Rao

Dwaraka Tirumala Rao

APSRTC: త్వరలో సుమారు 1500 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి కొనుగోలు చేస్తున్నాం.. ఏపీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఇన్ని బస్సులు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అన్నారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రోజు ఓ పత్రికలో వచ్చిన వార్త పూర్తి అవాస్తవం.. నిరాధారం అన్నారు.. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు 140 కోట్ల కిలోమీటర్లు తిరుగుతాయి 27 కోట్ల లీటర్ల డిజిల్ ప్రొక్యూర్ చేస్తాం.. భారత్, ఇండియన్ , హిందూస్తాన్ వంటి కంపెనీల నుండి డైరక్ట్ గా టెండర్ల ద్వారా ప్రొక్యూర్ చేస్తామని తెలిపారు.. అన్ని కోట్ల లీటర్ల డిజిల్ ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి ఏ కంపెనీ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే ఆ కంపెనీకి ప్రయారిటీ ఇస్తాం.. 2022 మార్చి నుండి 2025 ఫిబ్రవరి వరకు టెండర్ 5.87 పైసలు లీటరు డిస్కౌంట్ ఇవ్వడంతో 157 కోట్లు ఆదా వస్తుంది.. అందుకే ఆ టెండర్ ఖరారు చేశామని స్పష్టం చేశారు.. బల్క్ రేట్లు పెరగడంతో లోకల్ గానే డీజిల్ ప్రొక్యూర్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.. 2022 ఫిబ్రవరి న ప్రతి జిల్లాలో ఆర్ఎం ఓ కమిటీ ఏర్పాటు చేసి లోకల్ గా రిటైల్ ద్వారా డీజిల్ కొనుగోలు చేశామని తెలిపారు.

Read Also: Ram Charan: స్టార్ అయినా.. మెగా పవర్ స్టార్ అయినా భార్య బ్యాగ్ లు మోయాల్సిందే

మార్చి 1 వ తేదిన బల్క్ రేట్లు తగ్గాయి.. మరలా బల్క్ రేట్ల ద్వారా డీజిల్ కొనుగోలుకు వెళ్లామని తెలిపారు ద్వారకా తిరుమలరావు.. త్వరలో సుమారు 1500 డీజిల్ బస్సులు 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి కొనుగోలు చేస్తున్నామని తెలిపిన ఆయన.. ఏపీఎస్‌ ఆర్టీసీ చరిత్రలో ఇన్ని బస్సులు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అని ప్రకటించారు.. కర్ణాటకలో కొత్తగా తీసుకువచ్చిన 15 మీటర్ల బస్సులను తీసుకొస్తాం.. 2,736 మొత్తం బస్సులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక, 15 ఏళ్లు పూర్తి అయిన 221 బస్సులు గుర్తించాం.. కొత్త బస్సులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.. కొత్త బస్సులకు రూ.572 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.

Exit mobile version