Site icon NTV Telugu

Merugu Nagarjuna: జగనన్న విదేశీవిద్యకు దరఖాస్తుల ప్రక్రియ షురూ.. గడువు?

Merugu Nagarjuna

Merugu Nagarjuna

అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న విదేశీవిద్య పథకానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జన తెలిపారు. జగనన్న విదేశీవిద్య పథకానికి ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనేపథ్యంలో.. జగనన్న పథకంలో ఏడాదికి ఇంతమందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టం చేశారు. అయితే.. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాల వారికి కూడా విదేశీవిద్యను అందుబాటులోకి తెస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు.

ఈ పథకానికి జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అయితే.. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందడానికి అర్హులేనని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. ఆయా కేటగిరీల దరఖాస్తులను రాష్ట్రస్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను తమ శాఖకు ఇస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లలో శిక్షణపొందే వారికి మెరుగైన శిక్షణ అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో.. స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.
Iraq clashes: ఇరాక్ ఘర్షణల్లో 20కి చేరిన మృతుల సంఖ్య

Exit mobile version