ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండి (నవంబర్ 22) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. సోమవారం (నవంబర్ 24) నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణిస్తూ.. నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందందని పేర్కొంది.
Also Read: Ambati Rambabu: మీరు ఎంతగా నొక్కాలని చూస్తే.. జనం అంత ఎక్కువగా వస్తున్నారు!
ఈనెల 27 నుంచి 29 వరకు (గురు, శుక్ర, శని వారాల్లో) కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరి కోతల నేపథ్యంలో రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పండిన ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలని పేర్కొంది. ప్రజలు సమాచారం, అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
