CS Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా వివిధ ముఖ్య కూడళ్ళు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు తదితర చోట్ల ఏర్పాటు చేసిన 14వేల సీసీటీవీ కెమెరాలు అన్నీ సక్రమంగా పని చేసేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. సీసీటీవీ ప్రాజెక్టు, డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ అంశాలపై ఏపీ సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
Read Also: Amazon Sale: రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై బెస్ట్ డీల్స్.. రూ.60 వేలకుపైగా తగ్గింపు!
అయితే, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 14 వేలకు పైగా కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని సీఎస్ విజయానంద్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ట్రాఫిక్ ఉల్లంఘనలను అదుపు చేసేందుకు సీసీటీవీ కెమెరాలను రియల్ టైం గవర్నెస్ కేంద్రంతో అనుసంధానించి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలన్నీ సక్రమంగా పని చేసేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలను తక్షణం పరిష్కరించి సీసీటీవీలు అన్నీ కెపనిచేసేలా చూడాలన్నారు.
Read Also: స్మార్ట్ ఫీచర్లతో స్టైలిష్ టీవీ.. Panasonic 50 ఇంచుల మోడల్‌పై భారీ డిస్కౌంట్
ఇక, వివిధ పట్టణ ప్రాంతాల్లో 123 సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదని గుర్తించినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యకర్శి కె. సురేష్ కుమార్ వివరించారు. వెంటనే అన్ని పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనంగా మరో 188 కొత్త కూడళ్ళను గుర్తించి అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు ఇప్పటికే ఏజెన్సీకి పనులు అప్పగించడం జరిగిందని, జిల్లా కలెక్టర్లతో తరచు ఈ అంశంపై సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలే కాకుండా సీఎస్ఆర్ నిధులతోనూ, ఇతర విధంగాను ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను కూడా నియంత్రణలోకి తీసుకుని సక్రమంగా పని చేసేలా చూడాలని సీఎస్ విజయానంద్ సూచించారు.
