NTV Telugu Site icon

AP SSC Supplementary Results: టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 64.23 శాతం ఉత్తీర్ణత

Ssc Supplementary Results

Ssc Supplementary Results

ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి సప్లిమెంటరీ, బెటర్ మెంట్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. గత రెండేళ్లలో కోవిడ్ వల్ల తరగతలు జరగకపోవడం వల్ల టెన్త్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని.. దీంతో సప్లిమెంటరీ నిర్వహించి… రెగ్యులర్‌గా పాస్ అయిన విద్యార్థులతో సమానంగా గుర్తింపు ఇస్తున్నామని తెలిపారు.. సప్లిమెంటరీ పరీక్షలను బాలురు 1,09,413, బాలికలు 82,433 మంది రాయగా.. బాలురు 60 శాతానికి పైగా, బాలికలు 68 శాతం పాస్‌ అయ్యారని తెలిపారు.. 1,91,896 మంది పరీక్ష రాస్తే 1,31,233మంది పాస్ అయ్యారని.. మొత్తంగా 64.23 శాతం ఉత్తీర్ణత సాధించారని.. 87.52 శాతం విద్యార్థులు పాస్‌ కావడంతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో.. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారని వెల్లడించారు.

Read Also: Jyothula Chantibabu: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం…?

గత ప్రభుత్వ హయాంలో పదవ తరగతి పరీక్షలు చూసి రాసే పద్ధతికి మేం చెక్ పెట్టాం, పరీక్ష విధానంలో మామీద ఎన్నో విమర్శలు వచ్చాయి… మా విధానం మేం అనుసరిస్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. ఈ ఒక్క సారికే సప్లిమెంటరీ పద్ధతి.. మరోసారి ఈ విధానం వుండదన్న ఆయన.. ప్రభుత్వ ఉద్దేశ్యం ఒక్కటే… పరీక్షలు పకడ్బందీగా నిర్వహించటం అన్నారు. పాఠశాలలు విలీనం జరగలేదు… క్లాసులు మాత్రమే విలీనం జరిగాయని.. ఎక్కడ తల్లితండ్రులు నుంచి మాకు ఇబ్బందులు లేవు, విద్యార్ధులకు ఇబ్బందులు వుంటే పరిశీలిస్తున్నామన్నారు.. క్లాసులు చెట్లు కింద నిర్వహిస్తున్నారు అని పత్రికల్లో వస్తున్నాయి… ఇలాంటి వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. పోటీతత్వంలో విద్యార్థులు రాణించాలనే విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నామన్న ఆయన.. ఆగస్టు 15వ తేదీ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారో.. తగ్గరో తెలియజేస్తాం అన్నారు.. ఇదే సమయంలో.. ప్రైవేట్ పాఠశాలలకు మేం వ్యతిరేకం కాదు.. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు మంత్రి బొత్స.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు వుండాలని ఉపాధ్యాయులను కోరిన ఆయన.. నాడు – నేడు పనులు పూర్తయ్యాక డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలో పెడతామని ప్రకటించారు. దేశంలో ఇలాంటి విధానం ఎక్కడ లేదు.. త్వరలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.