NTV Telugu Site icon

AP Police Constable Preliminary Exam: రేపే కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష.. ఇవి పక్కా పాటించాల్సిందే..

Ap Police Constable Prelimi

Ap Police Constable Prelimi

AP Police Constable Preliminary Exam: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. అయితే, అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష సెంటర్‌లోకి అనుమతిస్తారు అధికారులు.. ఉదయం 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.. ఇక, ఎగ్జామ్‌ సెంటర్‌లోకి మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్‌, కాలిక్యులేటర్‌, పర్సు, నోట్సు, ఛార్ట్‌లు, పేపర్లు, రికార్డింగ్‌ పరికరాలు సహా ఇతర ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతి ఉండదని తెలిపారు..

Read Also: Old City Hyderabad: గొడవలకు అడ్డాగా పాతబస్తీ.. పార్కింగ్‌ విషయంలో తల్వార్లతో దాడులు

అంటే.. పైన పేర్కొన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఏవైనా.. పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావొద్దని.. వాటని భద్రపరచటానికి ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయడం లేదని పోలీసు నియామక మండలి పేర్కొంది.. ఇక, కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష రాసే అభ్యర్థులు ఒక రోజు ముందుగానే.. పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తే మంచిదని.. కానీ, పరీక్ష రోజే.. ఎగ్జామ్‌ సెంటర్‌ వెతుక్కునే పనిలో ఉంటే.. పరీక్షకు ఆసల్యం అయ్యే అవకాశం ఉంటుందని.. ఒకరోజు ముందే సెంటర్‌ చూసుకుంటే.. టెన్షన్‌ ఉండదని చెబుతున్నారు.. ఇక, పరీక్ష రాసే అభ్యర్థులు.. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్‌ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలి. పరీక్ష హాల్‌ టికెట్‌, బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచనలు చేసింది పోలీసు నియామక మండలి.. కాగా, మొత్తం 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైతే.. 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులున్నారు.. రేపు జరగబోయే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 997 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చే శారు.. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లాల ఎస్పీలు పరిశీలించారు..