ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచే కొత్త జిల్లాల (New Districts) నుంచి పరిపాలన సాగాలన్న సర్కార్ ఆదేశంతో చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 25వ తేదీలోగా కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు.. కలెక్టర్లు.. ఎస్పీలతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
రేపో, ఎల్లుండో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షంచనున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం, ఆర్డీఓ, డీఎస్పీ వంటి ఆఫీసుల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భవనాలను గుర్తించాలి. మరో వారం రోజుల్లో కొత్త కలక్టరేట్లల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలి. కొత్త జిల్లాలకు వెబ్ సైట్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాల భవనాలకు తీసుకునే భవనాలకు ఆర్ అండ్ బి ధరల ప్రకారం అద్దె నిర్ణయించాలి. కొత్త జిల్లాల్లో ఇ-ఆఫీసు విధానాన్ని పటిష్టంగా నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.
