మంత్రి వర్గం కూర్పు ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేశారంటున్నారు. ఈ రోజు మధ్యాహ్యం 12 గంటలకు మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ను కలవనున్నారు. ఈ రోజు సాయంత్రానికి తుది జాబితాను రూపొందించి రేపు ప్రమాణస్వీకారానికి రావాలని సజ్జల ప్రత్యేకంగా కొత్త మంత్రులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు.
అయితే 10 మంది పాతవారినే కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త వారిలో 15 మందికే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, అనుభవం, జిల్లా అవసరమే ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గిరిజనులు, ఇద్దరు మైనారిటీలలతో పాటు ఆరుగురు ఎస్సీలకు క్యాబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
AP New Cabinet : మంత్రివర్గ కూర్పు కసరత్తు పూర్తి

Cm Jagan