రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష. ముఖ్యమంత్రి జగన్ దయతోను, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదు అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మాట్లాడే భాష, తీరు, వ్యవహరించే విధానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ ఆయనకు లేదు. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ఈయన అన్నీ గాలికొదిలేసి ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తాను ఎదో ఒక హీరోలాగా కనిపిస్తానని భ్రమపడి ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కడబడితే అక్కడ తన స్థాయిని మరచి ఎలాబడితే అలా మాట్లాడుతున్నారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ను తామంతా సమర్థిస్తున్నాం అని తెలిపారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది ఈ విషయం ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని అన్నారు.