Site icon NTV Telugu

Minister Savitha: ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదు..

Savitha

Savitha

Minister Savitha: తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపి వేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు అని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. చంద్రబాబును బూచీగా చూపించి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ది పొందే ప్రయత్నం అధికార, విపక్షాలు చేస్తున్నాయని తెలిపింది. జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారు.. రాయలసీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా జగన్ పనులు చేపట్టారు.. జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పనులపై కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసింది అని మంత్రి సవిత వెల్లడించింది.

Read Also: US-Venezuela Conflict: అధ్యక్షుడి అరెస్ట్‌కు వెనిజులా సైన్యమే సహకరించిందా.? రష్యా ఎయిర్ డిఫెన్స్ సైలెంట్ ఎందుకు..?

ఇక, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీ సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని ఏపీ మంత్రి సవిత తెలిపింది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేత.. 2020లోనే ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన ఎన్టీటీ, కేంద్ర ప్రభుత్వం.. ఇది ముమ్మాటికీ జగన్ చేసిన తప్పిదమేనని విమర్శలు గుప్పించింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే ప్రాజెక్టు పనులు కేంద్రం నిలిపింది అని సవిత చెప్పుకొచ్చింది.

Exit mobile version