Site icon NTV Telugu

అక్రమ లేఅవుట్లు గుర్తించాలి.. క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలి..

Peddireddy

Peddireddy

గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… జగనన్న స్వచ్ఛసంకల్పం, గ్రామపంచాయతీల పరిధిలో లేఅవుట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాలని… ప్రభుత్వపరంగా వాటి క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని.. అనుమతి లేని లేఅవుట్ల రెగ్యులరైజ్ తో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని స్పష్టం చేశారు.. ఇక, జగనన్న స్వచ్ఛసంకల్ప్ ద్వారా ఆరోగ్యవంతమైన గ్రామాణాలుగా తీర్చిదిద్దాలన్న ఆయన.. పారిశుధ్యం, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రణాళిక అవసరం అన్నారు.. దీనిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. కోవిడ్ సమయంలో పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యల వల్ల సత్ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి… జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపట్టాలని ఆదేశించారు.. వచ్చే ఏడాది అన్ని కాలనీల్లో అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుందని.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Exit mobile version