వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగు నీరందించేలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను గాడిలో పెడుతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారాయన.
అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఆర్ వంశధార, తోటపల్లి, వంశధార-నాగావళి లింక్, జంఝావతి, హిరమండలం లిఫ్ట్, నాగావళి- చంపావతి, మహేంద్ర తనయ, తరకరామతీర్ధసాగర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి నిమ్మల తెలిపారు.. రెండేళ్ళలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 2వేల కోట్ల నిధులు కేటాయించారన్నారు..
రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5006.35 మెగావాట్లుగా ఉందని మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్రం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ను తీసుకొచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని 78.50 గిగావాట్లుకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని పెంచకుండా, 9 సార్లు చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసింది రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, 2029 నాటికి ప్రభుత్వం లక్ష్యంపై బత్తుల బలరామకృష్ణ అడిగి ప్రశ్నకు గొట్టి పాటి సమాధానమిచ్చారు.
