NTV Telugu Site icon

జల జగడం.. కేంద్రానికి ఏపీ మరో లేఖ..

Irrigation Department

Irrigation Department

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… కేంద్రానికి వరుసగా లేఖలు రాస్తూనే ఉంది ఏపీ.. తాజాగా,, మరో లేఖ కేంద్రానికి వెళ్లింది.. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామల రావు.. భారీ ప్రాజెక్టులు, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను కాజేస్తోందని ఫిర్యాదు చేశారు.. 8 భారీ ప్రాజెక్టుల ద్వారా 183 టీఎంసీల నీటిని తెలంగాణా అక్రమంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని జల శక్తి శాఖకు రాసిన లేఖలో పేర్కొన్న ఆయన.. మధ్య తరహా, చిన్న తరహా, ఎత్తిపోతల ప్రాజెక్టులతో తెలంగాణ అనుమతులు లేకుండానే కృష్ణా నది నీటిని వినియోగించుకున్నట్టు శ్యామల రావు ఫిర్యాదు చేశారు. కాగా, నీటి వివాదంలో ఓవైపు ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే.. మరోవైపు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.