Site icon NTV Telugu

AP Inter Exams: పరీక్షల తేదీలు మారాయి..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం… జేఈఈ మెయిన్‌ దృష్ట్యా ఈ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తి కావాల్సి ఉంది.. కానీ, జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేశారు.. అయితే, ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే (మార్చి 11 నుంచి మార్చి 31) జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నామని.. ఇన్విజిలేషన్‌కు సిబ్బంది సమస్య లేదని స్పష్టం చేశారు. ఇక, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పరీక్షల తేదీలను పరిశీలిస్తే.. ఏప్రిల్‌ 22వ తేదీన పరీక్షలు మొదలై మే 12వ తేదీ వరకు జరగనున్నాయి..

Read Also: AP Assembly Session: సమావేశాలకు టీడీపీ దూరం..!

Exit mobile version