గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అధికార పార్టీ నేతల తీరును తప్పు పడుతూ కోర్టుకు వెళ్లారు అభ్యర్ధులు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా టెలికాస్ట్ చేయాలని, టీడీపీ అభ్యర్థులు, ఓటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టులో టీడీపీ అభ్యర్థులు పిటిషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులు, పోలింగ్ బూత్, ఓటర్లకు పోలీసులతో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసారు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించే విధంగా టెలికాస్ట్ చేయాలని ఎస్ఈసీకి హైకోర్టు సూచించారు.
మున్సిపల్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఆదేశాలు…
