AP Govt: ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నిన్న సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన.. కొద్దిసేపటి క్రితం కూడా బదిలీలపై సమీక్ష చేశారు. రైట్ పర్సన్ – రైట్ ప్లేస్ అనే కాన్సెప్ట్‌తోనే ఈ బదిలీలు జరగనున్నాయని సర్కార్ స్పష్టం చేసింది. జేసీల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీల వరకు ఈ మార్పులు జరిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక, ఎస్పీల నుంచి డీఐజీ, ఐజీ వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
Read Also: Boat Capsized: గోదావరి నదిలో పడవ బోల్తా.. ఒకరు గల్లంతు, ప్రాణాలతో బయట పడ్డ మరో వ్యక్తి
అయితే, ఇవాళ (సెప్టెంబర్ 8న) పలువురు ముఖ్య కార్యదర్శుల బదిలీలపై ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. సమూల మార్పుల ద్వారా పాలనలో వేగాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. గత 15 నెలల కాలంలో అధికారుల పనితీరుపై క్లారిటీ రావడంతో ఈసారి బదిలీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. కాగా, బాగా పనిచేసిన అధికారులను ప్రోత్సహించేలా, ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని వారిని మార్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. తన ఆలోచనలకు, పాలనా వేగానికి అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు.
