NTV Telugu Site icon

మినీ ట్ర‌క్కుల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం… స‌బ్బిడీ 60 నుంచి 90 శాతానికి పెంపు…

ఇంటింటికి రేష‌న్ ను పంపిణీ చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం 9 వేల‌కు పైగా మినీ ట్రక్కుల‌ను కొనుగోలు చేసింది.  ఈ ట్ర‌క్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు అంద‌జేసింది.  షెడ్యూలు కులాల వారికి ఈ ట్ర‌క్కుల‌ను అంద‌జేసింది.  ఈ మినీ ట్ర‌క్కుల‌పై గ‌తంలో ప్ర‌భుత్వం 60 శాతం స‌బ్సిడీ ఇచ్చింది.  మిగతా మొత్తాన్ని ల‌బ్ధిదారుడు పెట్టుకోవాలి.  అయితే, ఇప్పుడు ఇందులో మార్పులు చేసింది ప్ర‌భుత్వం.  60 శాతం ఉన్న స‌బ్సిడీని 90 శాతానికి పెంచింది.  10 శాతం మాత్ర‌మే ల‌బ్ధిదారుడు పెట్టుకోవాలి.  10 శాతం డబ్బును కూడా 72 విడ‌త‌ల్లో వాయిదా రూపంలో చెల్లించుకోవ‌చ్చు.  ఈ మేర‌కు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ‌కు ఏపీ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.  గ‌త జ‌న‌వ‌రి నుంచి రేష‌న్‌ను ఇంటింటికి స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది ఏపీ ప్ర‌భుత్వం.  

Read: మళ్ళీ రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు