Site icon NTV Telugu

కత్తి మహేష్ చికిత్సకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం..

Film Critic noted actor Kathi Mahesh latest health Update

ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. జూన్ 26 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన్ని చెన్నైకి తరలించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

read also :కాంగ్రెస్ లో గెలిచి… అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి : రేవంత్

అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్‌కు ఏపీ సర్కార్‌ భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఏకంగా రూ. 17 లక్షలు మేర ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే రిలీజ్‌ అయ్యాయి. ఆయనకు వైద్యం అందిస్తోన్న చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ఈ నిధులను బదలాయించేలా చర్యలు తీసుకుంది.

Exit mobile version