Site icon NTV Telugu

క్వారీలో పేలుడు : మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిన ఏపీ సర్కార్

మామిళ్ళపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 5 ప్రభుత్వశాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని..అయిదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వస్తుందని ఆయన వెల్లడించారు. తక్షణం నష్టపరిహారం కింద మృతులకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటిస్తున్నామన్నారు. లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. ఘటనాస్థలాన్ని డిఎంజి నేతృత్వంలో వెంటనే మైనింగ్ అధికారులు పరిశీలించారని ఆయన తెలిపారు. క్వారీనిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్‌లోడింగ్‌లో నిబంధనలు పాటించలేదని.. ఏపి చిన్న తరహా ఖనిజ నియమావళి 1966, MMD&R Act, 1957 ప్రకారం లీజుదారుపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Exit mobile version