విజయవాడ రాజ్ భవన్ లో కరోనా థర్డ్ వేవ్ నివారణ పై అవగాహన -స్వచ్ఛంధ సంస్ధల పాత్ర అంశంపై శుక్రవారం వెబినార్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ… కరోనా మూడో తరంగ నివారణలో రాష్ట్రం దిక్సూచీ కావాలి అన్నారు. కరోనా మూడవ తరంగం రాకుండా నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతరులకు దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.
కరోనా తొలి, మలి విడతలలో పలు స్వచ్ఛంధ సంస్ధలు అద్భుతంగా పని చేశాయని అదే క్రమంలో మూడో తరంగాన్ని ఎదుర్కోవటంలో తమదైన పాత్రకు సిధ్దంగా ఉండాలని సూచించారు. ఈక్రమంలో స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ పలు సూచనలు చేస్తూ టీకాలు పొందని వ్యక్తులను చైతన్యవంతం చేయాలని సూచించారు గవర్నర్.
