Site icon NTV Telugu

AP New Cabinet : మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

Biswa bhusan

Biswa Bushan

ఏపీలో కొత్త కేబినెట్‌ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. అయితే రాజీనామాల ఆమోదంపై మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో పాటు కొత్త మంత్రుల జాబితా తన వద్దకు రాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపనున్నారు. ఇదిలా ఉంటే… ఇప్పటికే కొత్త మంత్రుల లిస్ట్‌ కూడా ఫైనలైంది.

కానీ పేర్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాకుండా మంత్రివర్గం విస్తరణలో పాత 10 మంది మంత్రులు కొనసాగనున్నారు. అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, పేర్ని నాని లు కొనసాగనున్నట్లు సమాచారం.

https://ntvtelugu.com/ap-new-cabinet-10-old-ministers-name/

Exit mobile version