Site icon NTV Telugu

వైఎస్సార్ జయంతి : అవార్డులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

YS Jagan

అమరావతి : రేపు వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించనుంది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ అవార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డులు ఇవ్వనుంది.

read also : ఉద్యోగాల పేరుతో మోసాలు… టిటిడి కీలక ప్రకటన

విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్, అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకూ పురస్కారాలు అందించనుంది ఏపీ సర్కార్‌. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరించనుంది. అలాగే… వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరించనుంది.

Exit mobile version