P4 Survey In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 కార్యక్రమంపై ప్రత్యేక సర్వే చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12 ప్రశ్నలతో సర్వే నిర్వహించడానికి సిద్ధం అవుతుంది. గ్రామ వార్డు, సచివాలయ పరిధిలో సర్వే జరగనుంది. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. ఇతర ప్రాంతాల్లో ఎవరున్నారు అనే అంశంపై సర్వే చేయనున్నారు. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ప్రభుత్వం ఇస్తున్న పథకాల వివరాలపై ఆరా తీసే ఛాన్స్ ఉంది. కారు ఉందా, బైక్, టీవీ, ఫ్రిజ్, భూమి ఉన్నాయా అనే ప్రశ్నలు సర్వేలో అడగనున్నారు.
Read Also: Supreme Court: సిగ్గుపగుతున్నాం: ఒడిశా విద్యార్థిని ఆత్మహత్యపై సుప్రీంకోర్టు..
అలాగే, ప్రత్యేక యాప్ సహాయంతో ఏపీ సర్కార్ సర్వే చేస్తుంది. భవిష్యత్ లో ఉద్యోగం కావాలా, బ్యాంక్ లోన్ కావాలా లేదా బిజినెస్ పెట్టుకుంటారా అంటూ ఇలా
వివిధ ప్రశ్నలపై సర్వే చేయనున్నారు. వ్యవసాయ రుణాలు, ఆదాయ అభివృద్ధి కోసం ఏం కావాలి అనే అంశంపై కూడా ప్రశ్నించనున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం.. ఆగస్ట్ 15వ తేదీ వరకు బంగారు కుటుంబాల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది.
