కరోనా మహమ్మారి విజృంభణతో పరీక్షలు లేకుండానే అన్ని క్లాసుల విద్యార్థులను ప్రమోట్ చేసిన సర్కార్.. చివరకు టెన్త్, ఇంటర్ విద్యార్థులను సైతం పాస్ చేయింది.. అయితే, గతేడాది టెన్త్ పాసైన విద్యార్థుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గతేడాది టెన్త్ పాసైన విద్యార్థులకూ గ్రేడ్లు ఇవ్వనుంది ప్రభుత్వం.. గత ఏడాది టెన్త్ విద్యార్ధులందరూ పాస్ అని ప్రకటించిన సర్కార్.. పోటీ పరీక్షల్లో విద్యార్ధులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ఆల్ పాస్ విధానాన్ని సవరించి.. గ్రేడ్లు ఖరారు చేస్తూ గతేడాది టెన్త్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వనుంది విద్యాశాఖ.. ఫార్మెటీవ్, సమ్మేటీవ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ప్రకటించనుంది నిపుణుల కమిటీ. కాగా, పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు తమకు గ్రేడ్‌లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు గత ఏడాది టెన్త్ విద్యార్థులు.. ఇప్పటికే కొందరికి లేఖలు ఇస్తోంది పాఠశాల విద్యా శాఖ. మరోవైపు.. ఈ ఏడాది టెన్త్ పాసైన విద్యార్థులకు త్వరలోనే గ్రేడింగులు ప్రకటించేందుకు కూడా తుది కసరత్తు చేస్తున్నారు అధికారులు.
టెన్త్ పాసైన విద్యార్థుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం

students