Site icon NTV Telugu

కోవిడ్‌ పరిహారం కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌

కోవిడ్‌తో అనాధలైన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృష చేస్తుంది. ఇప్పటికే వారికి సాయం ప్రకటించింది. అయితే ఆ సాయం నేరుగా వారికే చేరేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను ఇక ఆన్‌లైన్‌ చేసేందుకు కోవిడ్‌ 19 పోర్టల్‌ను తీసుకొచ్చింది. కరోనా వైరస్‌ (కోవిడ్‌ – 19) కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించడానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు త్వరగా, సులభంగా నష్టపరిహారం అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Read Also:విశాఖలో నాలుగు థియేటర్లకు షోకాజ్ నోటీసులు…

మొబైల్‌తోపాటు కంప్యూటర్‌లోనూ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బాధితులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్‌లో నష్టరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం బాధితులు మృతుడికి కోవిడ్‌ నిర్థారించిన ఆర్‌టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ లేదా మాలిక్యులర్‌ టెస్ట్‌ రిపోర్టులలో ఏదో ఒక డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Exit mobile version