NTV Telugu Site icon

సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్‌ ప్రకటించిన ప్రభుత్వం…

2021-22 సంవత్సరంలో నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్‌ ప్రకటించింది ప్రభుత్వం. వివిధ సంక్షేమ పథకాలను ఎప్పుడెప్పుడు అమలు చేయబోతున్నారనే విషయాన్ని వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ నెలలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, రైతులకు సున్నా వడ్డీ(రబీ) అమలు చేస్తారు. ఇక మేలో ఉచిత పంటల బీమా(ఖరీఫ్), వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా… జూన్‌ లో జగనన్న విద్యా కానుక, వైఎస్సార్‌ చేయూత… జులైలో జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ వాహన మిత్ర, వైఎస్సార్ కాపు నేస్తం పథకాల అమలు చేస్తారు.

ఆగస్టు నెలలో రైతులకు సున్నా వడ్డీ(ఖరీఫ్‌),  ఎంఎస్ఎంఈ ప్రొత్సాహాకాలు, నేతన్న నేస్తం, అగ్రి గోల్డ్‌ బాధితులకు నష్ట పరిహరం చెల్లింపులు… సెప్టెంబర్‌ లో వైఎస్సార్ ఆసరా… అక్టోబర్‌ లో రైతు భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు.. నవంబర్‌ లో  వైఎస్సార్ ఈబీసీ నేస్తం.. డిసెంబర్ లో… జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ లా నేస్తం… జనవరి- రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, పెన్షన్‌ రూ. 2500కు పెంపు అమలు ఇక ఫిబ్రవరి నెలలో జగనన్న విద్యా దీవెన అమలు చేయనున్నట్లు అందులో తెలిపారు.