ఏపీ ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేట్లపై టీడీపీ తప్పుడు లెక్కలు చూపిస్తుంది. కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్థిక వృద్ధి కాలేదని యనమల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కరోనాకు ముందు ఏడాది 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23% వృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యవసాయ రంగంలో 7.91%; పారిశ్రామిక రంగంలో 10.24% వృద్ధి ఉంది. 2020-21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో ఏపీకి 3వ ర్యాంకు వచ్చింది. నీతీ ఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్ములన, అసమానతల తగ్గింపులో ఏపీ 5, 6 స్థానాల్లో ఉంది. కానీ తప్పుడు లెక్కలతో యనమల ప్రజలను బురిడీ కొట్టించలేరు. టీడీపీకి వ్యవసాయ రంగ అభివృద్ధి అసలు పట్టదు అని తెలిపారు మంత్రి.
చంద్రబాబుతో పాటు, టీడీపీ నాయకులు వ్యవసాయ రంగాన్ని ఏవిధంగా హేళన చేశారో, ప్రతి పక్షంలో ఉన్నా కూడా అదే ధోరణితో ఉన్నారు. రాష్ట్రానికి జీవనాధారమైన వ్యవసాయ రంగ వృద్ధి రేటును దాచి రైతన్నను మోసం చేస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న యనమల కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్ధిక వృద్ధి కాలేదు అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని పేర్కొన్నారు.