Site icon NTV Telugu

ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల…

ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ఈఏపీ సెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కు మొత్తంగా 2, 59, 688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 83,820. అందులో పరీక్షలకు 78,066 మంది హాజరుకాగా 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారు. హాజరైన విద్యార్థుల్లో మొత్తం 92.85% మంది విద్యార్థులు అర్హత పొందారు. ఇక రేపటి నుంచి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. అలాగే పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ కాకినాడకు, అధికారులకు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలియజేసారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Exit mobile version