వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. రేపు రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా ఉంటుంది. కాబట్టి రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు అని విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు.