NTV Telugu Site icon

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఏపీ డిప్యూటీ స్పీకర్..

కేంద్రమంత్రులు పశుపతి పరాస్ పాశ్వాన్, కిషన్ రెడ్డిని ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి పశుపతి పరాస్ పాశ్వాన్ ను కలిశాను. రాష్ట్ర విభజన తరువాత ఏపీ 74 శాతం వ్యవసాయం పై ఆధారపడింది. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి ఉన్న పథకాలను యధావిధిగా కొనసాగించాలని కోరాం. వ్యవసాయం ,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు
ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించాం. పోలవరం ప్రాజెక్టు పురోగతిని కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పర్యటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి కృషి చేయాలని కిషన్ రెడ్డిని కోరాను. ఆగస్టు 6,7 తేదీల్లో ఏపీ వస్తానని కిషన్ రెడ్డి తెలిపారు.

ఇక రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం పట్ల అభినందనలు తెలిపాను. సూర్యలంక టూరిజం సహా బాపట్లో ప్రఖ్యాత క్షీర భావ నారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం త్వరలో డిపిఆర్ సమర్పిస్తాం. భవిష్యత్ లో ఏపీ టూరిజం హబ్ గా మారబోతోంది. కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చాలా సానుకూలంగా స్పందించారు. కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి తెలుగువాడు కావడం గర్వకారణం. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం “దిశ” బిల్లు తీసుకు వచ్చింది. ప్రొసీజరల్ ప్రాసెస్ కారణంగా “దిశ” బిల్లు కేంద్రం వద్ద ఆలస్యం అవుతుందని భావిస్తున్నాను.