Site icon NTV Telugu

Deputy CM Pawan: హ్యాపీ బర్త్‌డే మోడీజీ.. మీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా..!

Pawan

Pawan

Deputy CM Pawan: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాధారణ స్థితి నుంచి దేశాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగిన మోడీ.. క్రమశిక్షణ, కట్టుబాటుతో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఇక, ఆత్మ నిర్భార్ భారత్ పేదల పట్ల కరుణ, అణగారిన వర్గాల పట్ల అంకితభావానికి నిదర్శనం అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ప్రతి భారతీయుడిని దేశ నిర్మాణంలో భాగస్వామి చేస్తున్నారు.. విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రజలతో మమేకమై ప్రధాని మోడీ పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.

Read Also: Doctors Negligence: వైద్యుల‌ నిర్లక్ష్యంతో బాలింత మృతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..?

ఇక, ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టాడు ప్రధాని మోడీ దౌత్యం అమోఘమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సంప్రదాయం ఆధునికత సమతుల్యం చేస్తూ గ్లోబల్ సహకారం సాధిస్తున్నారు.. ధైర్యం, నిజాయితీ, ఆధ్యాత్మిక శక్తికి నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. దేశ ఏకత్వం, పురోగతి, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ కోసం మోడీ అలుపెరగని కృషి చేస్తున్నారని కొనియాడారు. పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని పవన్ కళ్యాణ్ ప్రార్థించారు.

Exit mobile version