NTV Telugu Site icon

నేను అప్పుడే జగన్ పాదాలకు దండం పెట్టా- డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.. తాడేపల్లిలో జ‌రిగిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ప్రజా ప్రతినిధులతో క‌లిసి పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం మాల, మాదిగల్లో చీలికలు తీసుకుని వచ్చార‌ని ఆరోపించారు.. తమ సమస్యలు పరిష్కారించాలనే గెజిటెడ్ ఉద్యోగులు మనల్ని ఇక్కడకు పిలిచార‌న్న ఆయ‌న‌.. అమ్మ ఒడి పథకం పెట్టినప్పుడే నేను సీఎం వైఎస్‌ జగన్ పాదాలకు దండం పెట్టాను.. అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఇక‌, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించి పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంటే… చంద్రబాబు విమర్శిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ప్రమోషన్లలో తమకు అన్యాయం చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల చెప్పార‌న్నారు.. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సజ్జలను కోరుతున్నాన‌ని ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి.