Site icon NTV Telugu

భువనేశ్వర్ చేరుకున్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సాయంత్రం సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే భువనేశ్వర్ చేరుకున్నారు సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారుల బృందం. ఏపీ సీఎస్ కి ఒరిస్సా అధికారులు స్వాగతం పలికారు. రెండురాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలను ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు.

ఉదయం 10.45 కు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకోనున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడినుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ కు ప్రయాణం కానున్నారు.

సాయంత్రం 5.20 కు భువనేశ్వర్ లోని లోకేశ్వర భవన్ కు చేరుకుంటారు. అనంతరం ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో దాదాపు గంటన్నర పాటు సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్. రెండు రాష్ట్రాలకు సంబంధించి వివిధ పెండింగ్‌ అంశాలపై చర్చలు జరుపుతారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు సీఎం జగన్.

Exit mobile version