NTV Telugu Site icon

ఏపీలో కరోనా అప్డేట్‌… కొత్తగా 1,515 కేసులు

ఏపీలో క‌రోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 1,515 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,09,245 కి చేరింది. ఇందులో 19,80,407 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా, 15,050 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 13,788 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 68, 865 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది సర్కార్‌.