NTV Telugu Site icon

ఏపీ క‌రోనా అప్డేట్‌…

ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.  ప్ర‌తిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.  ఇక స్కూళ్లు తిరిగి ప్రారంభించిన త‌రువాత ఈ కేసుల సంఖ్య మ‌రింత‌గా పెరిగింది.  ప్రతిరోజూ స్కూళ్ల‌లో విద్యార్దులు, ఉపాద్యాయుడు క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్నారు.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 1539 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,07,730కి చేరింది.  ఇందులో 19,79,704 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా, 14,448 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 12 మంది బాదితులు ప్రాణాలు కోల్పోయారు.  దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 13,778కి చేరింది.  చిత్తూరులో 243, తూర్పుగోదావ‌రి జిల్లాలో 228, గుంటూరులో 127, కృష్టాజిల్లాలో 194, నెల్లూరులో 176, ప్ర‌కాశంలో 126, ప‌శ్చిమ గోదావ‌రిలో 163 కేసులు న‌మోద‌య్యాయి.

Read: తాలిబ‌న్ల అరాచక పాలనలోనూ లాభాలు ఆర్జిస్తున్న ఆయన వ్యాపారం… ఎలాగంటే…