NTV Telugu Site icon

ఏపీలో కొత్త కరోనా కేసులెన్నంటే..?

ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన కరోనా… ఏపీలో తగ్గుముఖం పడుతోంది. తాజాగా 33,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 262 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అయితే గడిచిన 24 గంటల్లో కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించినట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో పాటు 229 మంది కరోనా నుంచి కొలుకున్నారు.

ఇప్పటివరకు మొత్తం 20,69,614 మందికి కరోనా వైరస్‌ బారిన పడగా, 20,51,976 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే మొత్తం ఇప్పటివరకు 14,411 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 3,227 కరోనా కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి.