NTV Telugu Site icon

ఫిషింగ్ హార్బర్లపై ఫోకస్.. సీఎం ఆదేశాలు

ప్రాజెక్టులన్నీనిర్ణీత సమయంలో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్.. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ (ఏఐఎఫ్‌) ప్రాజెక్టులపై క్యాంప్‌ కార్యాలయంలో స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాల‌న్నారు.. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాల‌ని.. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాల‌ని స్ప‌ష్టం చేశారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల‌ని సూచించిన సీఎం.. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు.. అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాల‌ని ఆదేశించారు. ఇక‌, కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌పై దృష్టి సారించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు, కాకినాడ ఫిషింగ్‌ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించిన ఆయ‌న‌.. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్భర్‌ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల‌న్నారు.