తూర్పుగోదావరి జిల్లాలోని బెంగపూడి విద్యార్థుల ప్రతిభకు ఫిదా అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… తనను కలవటానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. దీంతో, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఐదుగురు విద్యార్థులు, ఇంగ్లీష్ టీచర్.. విద్యార్థులతో సంభాషించి వారిని అభినందించనున్నారు సీఎం వైఎస్ జగన్.. కాగా, బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల భాషా నైపుణ్యం ఇప్పుడు ఖండాంతరాలు దాటింది.. బెండపూడి పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది.. ఓ మారుమూల గ్రామంలోని పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులు ఏకాంగా అమెరికా విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడంతో.. బెంగపూడి విద్యార్థులు, టీచర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.. ఇది సీఎం జగన్ దృష్టికి కూడా వెళ్లడంతో.. వారికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
అయితే, ప్రభుత్వ స్కూళ్లలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియానికి కూడా అవకాశం కల్పించింది ఏపీ సర్కార్.. దీనిపై విమర్శలు వచ్చినా.. వెనక్కి తగ్గకుండా అమలు చేస్తున్నారు.. ఇక, స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం అనే 100 రోజుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. 5 నుంచి 10వ క్లాస్ వరకు విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలపై పట్టు ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. దీనికి బెండపూడిలో జీవీఎస్ ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచనలు జోడించారు.. అమెరికాలోని విద్యార్థులతో డిబేట్‌లలో పాల్గొనేలా తన విద్యార్థులను ప్రోత్సహించారు.. ఇప్పుడు వారికి ఇంగ్లీష్‌పై ఉన్న పట్టుతో కార్పొరేట్ స్కూళ్లు కూడా ఔరా! అనాల్సిందే.. బెండపూడి విద్యార్థులు ఇప్పుడు అమెరికాలో వాడుక భాష స్టైల్‌లో చాలా సాదాసీదాగా ఆంగ్లాన్ని మాట్లాడేస్తున్నారంటే.. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థుల ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.