ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంలో పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు పోలవరం చేరుకుంటారు. ఉదయం 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు సీఎం జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోకి వరదనీరు చేరడంతో పనులు మందగించాయి. ఈ ఏడాది జూన్ నాటికి పోలవరంను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా కరోనా, నిధుల కొరత కారణంగా ఆలస్యం అయింది.
Read: జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !