NTV Telugu Site icon

CM YS Jagan: అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Jagan Amit Shah Meeting

Jagan Amit Shah Meeting

AP CM YS Jagan Mohan Reddy Met With Amit Shah In Delhi: ప్రస్తుతం ఢిల్లీ టూర్‌లో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. న్యూ ఢిల్లీలోని హోంమంత్రి నివాసంలోనే వీళ్లిద్దరు సమావేశం అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు.. వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని సీఎం కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. న్యూఢిల్లీలో ఏపీ భవన్‌ సహా షెడ్యూల్‌ 9, 10 ఆస్తుల విభజన అంశాల్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిల అంశాలను అమిత్ షా ముందు తీసుకొచ్చారు. ఏపీ విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకుని.. వెంటనే ఈ బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల్లో ఊహించని ఘటన.. లోన్ తీసుకోపోయినా..

అంతకుముందు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయినప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై సీఎం జగన్ చర్చలు జరిపారు. 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్యకాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,756.92 కోట్ల బకాయిలను జాప్యం లేకుండా త్వరగా ఇప్పించాలని, ఏపీ జెన్‌కో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. స్కూళ్లలో నాడు-నాడు కార్యక్రమం కింద ఏపీ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఖర్చుచేసిందని, ఆరోగ్య రంగంలోనూ నాడు-నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, ఇందుకు గాను రూ. 4వేల కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభవిష్యత్తును తీర్చిదిద్దుతాయని, వీటి కోసం చేసిన ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్‌ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాలని కోరారు.

Sunisith: ప్యాంట్ తడిచేలా భయపెట్టినట్టున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సారీ చెప్పక చస్తాడా