Site icon NTV Telugu

అందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలి.. సీఎం జగన్‌ శుభాకాంక్షలు

YS Jagan

దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు.. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు సీఎం వైఎస్‌ జగన్‌. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.

Exit mobile version