పోలీసులపై పని ఒత్తిడి తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. మొదట గౌరవ వందనం స్వీకరించారు.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం వల్ల మావోయిస్టుల ప్రభావం తగ్గిందన్నారు. మనస్సులను గెలుచుకోవడం ద్వారా శాంతి భద్రతలను పరిరక్షించుకోవచ్చు అన సూచించిన ఆయన.. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఉండాలనేది నా మనస్సులో మాట.. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా వీక్లీ ఆఫ్ అమలు చేయలేకపోయాం.. దీనిని దృష్టిలో పెట్టుకునే 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.. పోలీసులు ప్రజల కోసం ప్రాణాలొడ్డి విధులు నిర్వహిస్తారు.. పోలీస్ వ్యవస్థకు సమాజం అండగా ఉంటుంది.. కానీ, విధి నిర్వహణలో ఉంటూ ఏపీలో 11 మంది పోలీసులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: KTR Tweet: ముసలోడిని అయిపోయా.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
పోలీస్ శాఖలో సిబ్బంది కొరత తగ్గించనున్నాం.. పని ఒత్తిడి తగ్గిస్తాం అని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో రిక్రూట్మెంట్ చేయలేదన్నారు.. హోంగార్డుల గౌరవ వేతనం పెంచాం.. 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీలో హోంగార్డులకు రిజర్వేషన్ ఉందన్నారు.. ఇక, 16 వేలకు పైగా గ్రామ మహిళా పోలీసులను నియమించాం.. 1.33 కోట్ల ఫోన్లల్లో దిశా యాప్ డౌన్ లోడ్ అయ్యిందని.. దిశా యాప్ ద్వారా మహిళలను కాపాడగలిగామని వెల్లడించారు. 1,237 చోట్ల ఆపద జరగక ముందే యాప్ ద్వారా సమాచారంతో కాపాడగలిగాం.. పోలీస్ అన్న ఉన్నాడనే భరోసా మహిళలకు ఇవ్వగలిగామన్నారు.. మహిళలపై వేధింపుల కేసుల్లో 42 రోజుల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి అవుతోందన్న సీఎం.. నేరాల నియంత్రణలో మార్పు.. జవాబుదారీ తనం తీసుకొచ్చామని ప్రకటించారు. ఇక, వైఎస్సార్ అచీవ్‌మెంట్స్ అవార్డుల్లో పోలీసులకూ ఇవ్వబోతున్నాం అని తెలిపారు. ఒక దళిత మహిళను హోం మంత్రిగా చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..