Site icon NTV Telugu

28న జగన్‌కు స్పెషల్‌ డే.. ఐదు రోజుల ఫ్యామిలీ ట్రిప్‌..

ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సీఎం బాధ్యతలు.. ఇదే సమయంలో ఫ్యామిలీకి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌… ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ పాదయాత్రలు వాయిదా వేసుకుని కూడా విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాలున్నాయి.. కానీ, ఈ మధ్య వైఎస్‌ జగన్‌ స్వదేశీ, విదేశీ పర్యటనలకు కాస్త గ్యాప్‌ వచ్చేసింది.. అయితే, ఈ నెల 28వ తేదీన వైఎస్‌ జగన్‌ జీవితంలో ఓ స్పెషల్‌డే రానుంది.. అదే జగన్‌-భారతి పెళ్లిరోజు.. పెళ్లి రోజు మాత్రమే కాదు.. సిల్వర్‌ జూబ్లీ జరుపుకోనున్నారు.. వైఎస్‌ జగన్‌-భారతి పెళ్లి జరిగి 25 ఏళ్లు కావస్తుంది.. ఈ సందర్భంగా.. రాజకీయాలు, సీఎం బాధ్యతలకు దూరంగా ఐదు రోజుల పాటు పూర్తిగా ఫ్యామిలీతో గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు..

రేపటి నుంచి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగనుంది.. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరనున్నారు.. ఇక, సాయంత్రం 4 గంటలకు సిమ్లాకు చేరుకోనున్నారు.. ఐదు రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.

Exit mobile version