NTV Telugu Site icon

Andhra Pradesh: విశాఖలో నేడు హర్యానా సీఎంతో సీఎం జగన్ భేటీ.. కారణం ఇదేనా?

Ap Cm Jagan

Ap Cm Jagan

నేడు ఏపీ సీఎం జగన్ విశాఖ వెళ్లనున్నారు. విశాఖలో ఆయమన హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటల పర్యటన కోసం సీఎం జగన్ విశాఖకు వెళ్తున్నారు. ఉ.11:10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన అక్కడ సుమారు గంటల పాటు జిల్లా నాయకులతో భేటీ కానున్నారు. అనంతరం రుషికొండలోని పెమా వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లి అక్కడ నేచురోపతి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న హర్యానా సీఎంను కలవనున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

అయితే హర్యానా సీఎంతో ఏపీ సీఎం జగన్ భేటీ సాధారణ భేటీ కాదని తెలుస్తోంది. మనోహర్ ఖట్టర్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి సన్నిహితమైన నేత. ఆయన విశాఖలో ప్రస్తుతం నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆయన్ను జగన్ కలుస్తున్నారంటే.. రాజకీయంగా ఏదో కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న వేళ.. ఖట్టర్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా మోదీ నిలబెడుతున్నారా? ఆ అంశంపైనే జగన్ మంతనాలు చేస్తున్నారా? లేదా ఏదైనా బిజినెస్ ప్రపోజల్‌కు సంబంధించి కలుస్తున్నారా? లేదా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా అభివృద్ది ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి జగన్ కలుస్తున్నారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Deputy CM Mutyala Naidu: పెన్షన్ల పంపిణీపై విషప్రచారం