Site icon NTV Telugu

CM Jagan: ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది

Cm Jagan Tributes Ysr

Cm Jagan Tributes Ysr

CM Jagan: ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయి నేటితో 13 ఏళ్లు పూర్తవుతోంది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, ఇతర వైఎస్ఆర్ కుటుంబసభ్యులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌ను తలుచుకుంటూ సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి.. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు… ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అంటూ జగన్ పేర్కొన్నారు.

అటు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఈరోజు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేపడతామని పార్టీ నేతలు, వైఎస్ఆర్ అభిమానులు వెల్లడించారు. మరోవైపు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

2

Exit mobile version