Site icon NTV Telugu

వైయస్సార్‌ బీమాలో మార్పులు… జులై 1 నుంచి అమలు

cm-jagan

వైఎస్సార్ బీమా పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్‌ బీమాలో మార్పులు చేసారు. క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించనుంది. కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు సహజంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 1లక్ష ఆర్థిక సహాయం… ఒకవేళ సంపాదించే వ్యక్తి,18- 70 ఏళ్ల మధ్య ఉన్నవారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5లక్షల ఆర్థిక సహాయం అందనుంది. జులై 1 నుంచి కొత్త మార్పులతో వైయస్సార్‌ బీమా అమలు కానుంది.

అయితే సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిములను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జులై 1లోగా ఈ క్లెములన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం… రైతుల ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణించినా, పాడిపశువులు మరణించినా తదితర వాటికి ఇచ్చే బీమా పరిహారాలన్నీ కూడా దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని తెలిపారు.

Exit mobile version